Naa Saami Ranga movie all songs lyrics
Naa Saami Ranga all songs lyrics
In the
Telugu film "Naa Saami Ranga," Ashika Ranganath, Raj Tarun, Allari
Naresh, and Nagarjuna Akkineni appear. Directed by Vijay Binni, with musical
compositions by MM Keeravani. January 14, 2024, saw the release of this Telugu
film.Explore the beautiful lyrics of Naa Saami Ranga, a Telugu movie that
captivates your heart with its lyrical tunes. Take in the feelings portrayed in
each phrase as you lose yourself in the beauty of the songwriting. Discover the
enchantment of Naa Saami Ranga's music, which features everything from upbeat
songs to romantic ballads. Prepare to sing along as you follow the Telugu song
lyrics in this post, which honor Naa Saami Ranga's musical journey.
Etthukelli Povaalanipisthunde Song Lyrics
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉల్లి మల్ల సీర గట్టి
కజ్జలు పైకెగగట్టి
ఉన్నవాళ్ళ పిల్లనంటవా గుమ్మా
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బీర పువ్వు రైక సుట్టీ
బిల్లంత బొట్టు పెట్టి
బైటకడుగు పెట్టనంటవ భామా
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందన
రమణి ముద్దుల గుమ్మ నందన
రావే రావే భామ నందనా
ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా
ఎత్తుకెళ్ళి పోతావా, పోతావా
బెల్లం సెరుకు సూపుల దాన
అల్లం మిరప మాటలదాన
బొండుమల్లి నడుము దాన
బండెడు సోకుల ఓ నెరజాణ
నువ్వట్ట పోతుంటే ఓ ఓ ఓ
నిన్నిట్ట సూత్తుంటే ఓఓ ఓ ఓ
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
నారెట్టి సుట్టేసి మోపల్లె కట్టేసి
నా నెత్తి మీదెట్టి గోదారి గట్టెంట
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
కడవల్లో నింపేసి కావిళ్ళో పెట్టేసి
ఇడిసి పెట్టకుండ నిన్నింక కడదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
నువ్వు నడిచెళ్ళితే నీ కాలి అంచు తాకి
మట్టి బెడ్డలన్ని మువ్వలయ్యాయే
నువ్వు నవ్వుతుంటే ఆ నవ్వు తీపి సోకి
చెట్టు కొమ్మలన్నీ తేనే పట్టులయ్యాయే
ఎంత ఎంత ఎంత ముద్దుగున్నావంటే
ఒక్క ఒక్క మాటలోన చెప్పాలంటే
చందమామకే పిల్లలు పుడితే
హే చందమామకే పిల్లలు పుడితే
నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే
(మరి అట్టా ఉంటె ఏం చేస్తాం)
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
నా గుండెకోటలో రాణివి నువ్వంట
నా రెండు కాళ్ల పల్లకిలోనా
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
మన ప్రేమకు పూసిన చిన్నారి పొన్నారి
పిల్లల్ని నువ్వు సంకనెత్తుకునేదాక
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందె పిల్ల
ఎత్తుకెళ్ళి పోవాలనిపిస్తుందే
Naa Saami Ranga Title Song Lyrics
మా జోలికొస్తే మాకడ్డువస్తే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, నా సామిరంగా
ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే
మామూలుగా ఉండదు
నా సామిరంగా, నా సామిరంగా
ఒక్కడు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
ఒక్కరు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
మాతోటి మాతోటి
మాతోటి పేచీ పడితే
సామిరంగా, నా సామిరంగా
సామిరంగా, నా సామిరంగా
సామిరంగా, నా సామిరంగా
సామిరంగా, నా సామిరంగా
సామిరంగా రంగా
నా సామిరంగా రంగా
సామిరంగా రంగా, నా సామిరంగా
ఈ గాలిలో పౌరుషముంది
ఈ మట్టిలో పంథం ఉంది
ఈ నీటిలో ప్రేమా ఉంది
ఈ నీటిని తాగి మట్టిని తాకి
గాలిని పీల్చి ఎదిగిన ఈ దేహంలో
శ్వాస ఉన్నంత వరకు
విశ్వాసం ఉంటాది
ప్రాణమున్నంత వరకు
అభిమానం ఉంటాది
మాతోటి మాతోటి
మాతోటి పేచీ పడితే
సామిరంగా, నా సామిరంగా
అరె సామిరంగా, నా సామిరంగా
సామిరంగా, నా సామిరంగా
సామిరంగా, నా సామిరంగా
సామిరంగా రంగా
నా సామిరంగా రంగా
సామిరంగా రంగా, నా సామిరంగా
Whistle
Theme Song Lyrics – Naa Saami Ranga
దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
అంజిది కిష్టయ్యది
విడదియ్యని ఒక బంధం
చిరునవ్వులు పూసే స్నేహం
చిరుగాలికి ఈల నా పాఠం
కడతేరని ఆనందంలో
కడదాకా సాగే పయనం
దేవుడే తన చేతితో
రాసిన ఒక కావ్యం
ఏరా ఒరే అనేటి ప్రాణమిత్రులు
పరాచకాలతోటి ఆటపాటలు
అన్నయ్య ఉంటే చాలుగా
ప్రాణాలు పంచే తీరుగా
కలిసింది పాలు తేనెలా
కలిపింది కాలం ప్రేమ పొంగేలా
దేవుడే రాసిన కమ్మని
ఒక కావ్యం
అంజిది కిష్టయ్యది
విడదియ్యని ఒక అనుబంధం
Inka Inka Song Lyrics
ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో
మనసులో తొంగిచూసి
మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి, నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే, ఏమని
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
ఇంకా ఇంకా దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో
మనసులో తొంగిచూసి
మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి, నన్ను చూసి
చెప్పాలని, చెప్పాలని
అనిపిస్తుందే, ఏమని
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
Dummu Dhukanam Song Lyrics
ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి
ఆ కుర్చీలోన అమ్మాయి
ఈ కుర్చీలోన అబ్బాయి
వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా
ముందుకు వచ్చిన వాళ్ళు
బంధుమిత్రులు అన్నదమ్ములు
పిల్లాపాపలు కుర్రమూకలు
పెద్దొళ్ళు చిన్నోళ్ళు
ఆడోళ్ళు మొగోళ్ళుదడి పేరే
దుమ్ము దుకాణం
దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం
ఈలలు వేస్తారు
కొందరు గోలలు చేస్తారు
కేకలు పెడతారు
కొందరు అరుపులు అరిచేరు
ఈ అరుపులకన్నా కేకలకన్నా
అల్లరికన్నా గడబిడకన్నా
అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకులే
అమ్మాయి అబ్బాయి గుండెల్లో మోగే
ప్రేమ తబలా ఢోలకు మోతే
దుమ్ము దుకాణం
దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం
పనిస గరిగమగమపమగరి గమప
నిరినిస నిదమగరి గనిసమమగరి
మమగరి మమగరినిస
మమప నిసగమపనిస
చెట్టూ ఊగింది
ఆటకు చేనూ ఊగింది
పిట్టా ఊగింది
కోడిపెట్టా ఊగింది
ఆ చెట్టూ పిట్టా ఇల్లు గడప
తలుపు కిటికీ అన్నీ ఊగి
పక్కూరు పై ఊరు
పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూళ్ళ పైదాక
పక్కూరు పై ఊరు పొరుగూరు ఇరుగూరు
జిల్లాలో పాతికూళ్ళ పైదాక
పాకింది చూడు
పాకింది చూడు
పాకింది చూడు
దుమ్ము దుకాణం
దుమ్మారె దుమ్మ
దుమ్ము దుకాణం
దుం దుం దుం దుకాణం
అరె దుముకు దుముకు దుం
దుం దుం దుం దుకాణం
Seesa
Mootha Ippu song Lyrics
పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే
ప్రేమ బండి చలో అంటే
రైస్ మిల్లు నెల జీతం
రై రైమని పెరిగిందంటే
ఫెవరేట్ హీరో బొమ్మ
హౌస్ ఫుల్లు పడిందంటే
ఇండియా కప్పు కొట్టుకొస్తే
ఇల్లాలే రాజీకొస్తే
పక్కింటోడికి లాసొస్తే
హ హ ఆడ్ని ఓదార్చే ఛాన్సే వస్తే
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
బోరు కొడితే బీరు కొట్టు
బాధ పడితే బ్రాందీ కొట్టు
ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు
మూడంతా పాడైపోతే
పై మూడు కలిపి కొట్టు
కట్టుకుందాన్తో కల్లే కొట్టు
అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు
సోదర సోదర అన్నోళ్ళతో
సోడా కలిపి కొట్టు
రా రా పోరా అన్నోళ్ళతో
రా గానే కొట్టు
మనకన్నా పెద్దోళొస్తే
మస్కా కొట్టు
సాటుగ మందే కొట్టు
మొదటి పెగ్గు ఎయ్యగానే
మత్తు కమ్ముకొస్తాది
రెండో పెగ్గు పడగానే
ఒళ్ళు తేలిపోతాది
మూడు నాలుగైదు పెగ్గులు
గొంతులోకి దిగగానే
నా సామిరంగ
సిత్రాలే సిత్రాలు
నా సామిరంగ
పెరటిలోని పిల్లి కూన
బౌ బౌ అంటాది
నూతిలోని సేపపిల్ల
సుట్ట కాల్చుతాది
సేతిలోని ఇసనకర్ర
సికెను ముక్కై పోతాది
మూలకున్న ఇసుర్రాయి
ఎండి కంచమే అది
తొంబై రూపాయల నోటు
జేబులోంచి జారుతాది
తొడుక్కున్న గళ్ళ లుంగీ
సొక్కా అయిపోతది
ఆ ముంగటేడు పోయిన
మా ముసలి తాత ఎదరకొచ్చి
ఏరా అబ్బీ తినలేదా
ఏమి తాగట్లేదా
బక్క సిక్కి పోయావు
ఏందిరా ఇదీ
అని పలకరిస్తాడు
ప్రేమగ హెచ్చరిస్తాడు
ఈ మందుని కనిపెట్టినోడు యాడున్నాడో
అరెరెరె మందుని కనిపెట్టినోడు
యాడున్నాడో
ఆడి కంటికి ముక్కుకి సెవులకి
కాళ్ళకి మూతికి సేతులకి
దండాలెట్టి, అరెరెరె దండాలెట్టి
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు

Comments
Post a Comment